లింగాష్టకం PDF | Lingashtakam PDF in Telugu

లింగాష్టకం PDF | Lingashtakam Telugu PDF Download

లింగాష్టకం PDF | Lingashtakam Telugu PDF Download for free using the direct download link given at the bottom of this article.

లింగాష్టకం PDF | Lingashtakam PDF Details
లింగాష్టకం PDF | Lingashtakam
PDF Name లింగాష్టకం PDF | Lingashtakam PDF
No. of Pages 2
PDF Size 0.16 MB
Language Telugu
CategoryEnglish
Source pdfsource.org
Download LinkAvailable ✔
Downloads17
Tags:

లింగాష్టకం PDF | Lingashtakam Telugu

Dear friends, here we are going to offer లింగాష్టకం / Lingashtakam PDF in Telugu for all of you. According to Hindu Vedic Scripture, Lingashtakam Stotram is considered one of the magical and powerful hymns. This hymn describes the praise and glory of Lord Shiva. It is also known as Maheswara, Mahakal, Shakar, Bholenath, Aadiyogi, Rudra, Pashupati etc.

It is said that the Linga is the symbol of Lord Shiva just as the Shankham (conch) and Chakra (discus wheel) are symbols of Lord Vishnu. Linga also means the gender of an organism. By reciting the divine Lingashtakam Stotra people seek the special blessings of Lord Shiva. If you want to peaceful and prosperous life then should recite it with reverence.

For your convenience here in this article, we have given a direct download link to Lingashtakam Telugu PDF which can be very useful for you. It is said that by reciting Lingashtakam Stotram people get desired results very easily. So guys if you want to easily please Lord Shiva then you must recite Lingashtakam Stotram with full devotion.

లింగాష్టకం Lyrics PDF / Lingashtakam Lyrics in Telugu PDF

Here you can also read the Lingashtakam Lyrics in Telugu with Meaning which can be very fruitful for you.

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || ౧ ||

అర్థం – ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || ౨ ||

అర్థం – ఏ లింగమును దేవతలయొక్క ఋషులయొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగియున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || ౩ ||

అర్థం – ఏ లింగము అన్నిరకముల సుగంధములచే అద్దబడియున్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై యున్నదో, ఏ లింగము సిద్ధులు, దేవతలు, అసురుల చే వందనము చేయబడుచున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయజ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || ౪ ||

అర్థం – ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడియున్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి యున్నదో, ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || ౫ ||

అర్థం – ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి యున్నదో, ఏ లింగము తామరపువ్వుల హారముతో అలంకరింపబడియున్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || ౬ ||

అర్థం – ఏ లింగమును దేవగణములచే భావముతో, భక్తితో పూజింపబడుచూ సేవింపబడుచూ ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || ౭ ||

అర్థం – ఏ లింగము ఎనిమిది రెక్కల పువ్వులను చుట్టూ కలిగియున్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై యున్నదో, ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || ౮ ||

అర్థం – ఏ లింగము సురులయొక్క గురువు (బృహస్పతి) మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చనచేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైనదానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో యున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

అర్థం – లింగాష్టకమను ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకములను శివుని (లింగం) దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు.

(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది)

Lingashtakam Stotram Benefits – Benefits of Chanting Lingashtakam

  • మీరు కుటుంబ జీవితంలో లేదా వృత్తిలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ లింగాష్టకం స్తోత్రం మీకు అన్ని సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  • ఈ వచనం చాలా అద్భుతంగా మరియు శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే దీన్ని క్రమం తప్పకుండా చదవడం ద్వారా, అన్ని కష్టాలు వెంటనే తొలగిపోతాయి.
  • పరమశివుడు ఈ దివ్య స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఎంతో సంతోషించి తన భక్తునికి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు.
  • లింగాష్టకం స్తోత్రాన్ని చదవడం ద్వారా అన్ని కష్టాలు క్షణాల్లో తొలగిపోతాయి మరియు చెడు కాలాలు కూడా ముగుస్తాయి.
  • మీరు మీ జీవితంలో మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ స్తోత్రం మీకు చాలా అద్భుతంగా మరియు ఉపయోగకరంగా ఉంటుంది.
  • మీ జీవితంలో కష్టాలు తగ్గకపోతే మీరు లింగాష్టకం స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
  • ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా శివుడు సులభంగా ప్రసన్నుడవుతాడు.
  • పరమశివుడు దేవతలకు ఆరాధ్యదైవం మరియు అతని అనుగ్రహంతో అన్ని కష్టాలు క్షణాల్లో తొలగిపోతాయి.
  • అందుకే దేవతలు కూడా శివ లింగాష్టకం పఠించడం ద్వారా శివుని స్తుతిస్తారని నమ్ముతారు.

Lingashtakam Telugu PDF | లింగాష్టకం PDF

Here you can download the లింగాష్టకం PDF / Lingashtakam with Lyrics in PDF by clicking on the following link.


లింగాష్టకం PDF | Lingashtakam PDF Download Link